సూర్య కొత్త సినిమా టీజర్ విడుదల అప్పుడే..!

Pulgam Srinivas
తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయా లను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా అంటే సూర్య ... ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం లో రూపొందిన గజినీ మూవీ ని తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు.

అలా గజిని మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత నుండి తాను నటించడం దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేసి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

 ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమా సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ గా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టీజర్ ను మే నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: