ఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అయినా "18 పేజెస్" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈ హీరో ప్రస్తుతం వరుస మూవీ లతో కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం నిఖిల్ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా నిఖిల్ "కార్తికేయ 2" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఎలా పోయిన సంవత్సరం కార్తికేయ 2 మూవీ తో అదిరిపోయే సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత 18 పేజెస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా త్వరలోనే ఈ మూవీ ని జీ తెలుగు ఛానల్లో ఈ సంస్థ ప్రచారం చేయనుంది. మరి ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఎ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: