ఆ సినిమా ఫెయిల్ అయింది అంటే అర్థం ఉంది... మోహన్ బాబు..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా నటుడి గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పరచుకున్న మోహన్ బాబు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వరకు విఫలం అవుతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మోహన్ బాబు తాను తాజాగా నటించిన సన్నాఫ్ ఇండియా మూవీ అపజయం గురించి స్పందించాడు ... అలాగే తన కుమారుడు మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా మూవీ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా మోహన్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... సన్నాఫ్ ఇండియా మూవీ ఒక ఎక్స్పరిమెంట్. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది అంటే అర్థం ఉంది ... కానీ మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా చాలా గొప్ప సినిమా ... అది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు సినిమాలు హీరో పాత్రలో నటించడం కంటే కూడా ఇతర ముఖ్యపాత్రలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో అనేక ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆదరించాడు. తాజాగా మోహన్ బాబు ... సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: