టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు డేట్ లాక్ చేసుకున్న RC15 టీం....

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల నుండి భారీగా లీక్స్ జరుగుతున్నాయి.స్టార్ హీరోలతో తీసే భారీ బడ్జెట్ సినిమాల నుండి మాత్రం వరుసగా లీక్స్ బయటకు వస్తూనే ఉంది.దీంతో ఈ విషయం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కానీ ఈ లీక్స్ ను ఆపలేక పోతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో రామ్ చరణ్,శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి మరింత లీక్స్ బయటకు వస్తున్నాయి.
మన స్టార్ హీరోల్లో రామ్ చరణ్ RC15 కు లీకుల సెగ ఎక్కువుగా ఉంది. ఈ సినిమా నుండి బాగా లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'RC15'. ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది. మిగతా పార్ట్ కూడా శరవేగంగా చేస్తున్నారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ హైప్ నెలకొంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక రూపంలో లీక్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి చరణ్ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో చరణ్ హెయిర్ స్టైల్, మెడలో ఒక తాడుతో డైనమిక్ లుక్ లో చరణ్ కనిపిస్తున్నాడు. మరి ఈ లుక్ చూసిన చరణ్ ఫ్యాన్స్ అంతా ఈ పుట్టిన రోజుకు అయినా లుక్ రివీల్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు  కానుకగా ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుంది అని బజ్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఇక మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.ఇదిలా ఉండగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: