నితిన్ ... వెంకీ కుడుముల మూవీ ఓపెనింగ్ కు రానున్న ఆ స్టార్ హీరో..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి నితిన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నీతిన్ ఆఖరుగా ఎం ఎస్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఈ మూవీ లో క్యాథరిన్ కూడా మరో హీరోయిన్ గా నటించగా ... సముద్ర కని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే నితిన్ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో దర్శకుడి గా కెరీర్ ను ప్రారంభించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ కి సైతాన్ అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ మరో మూవీ ని ఓకే చేశాడు. ఇది వరకే తనకు భీష్మ మూవీ తో మంచి విజయాన్ని అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ తదుపరి మూవీ ని చేయనున్నాడు. ఈ మూవీ లో భీష్మ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతోంది. జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ పూజ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: