మీటర్ మూవీ ప్రమోషనల్ టూర్ కి సంబంధించిన వివరాలను ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
 

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. రమేష్ కాడురి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకులను మంచి ఆదరణ లభించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా రేపు అనగా మార్చి 24 వ తేదీన ప్రమోషన్ టూర్ ను నిర్వహించనున్నట్లు అందుకు సంబంధించిన అప్డేట్ ను కూడా ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు "ఐ ఎస్ టి ఎస్" ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ... రాజమండ్రి కి వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు "ఎన్ జి వో" ఫంక్షన్ హాల్ నరేంద్ర సెంటర్ ... తణుకు కు వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ... తాడేపల్లిగూడెం కు వెళ్లనున్నట్లు ... ఆ తర్వాత రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కేఎల్ యూనివర్సిటీ ... విజయవాడ కు వెళ్ళనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: