పెళ్ళికి రాలేను క్షమించమని కోరిన ' సోగ్గాడు ' .....!!

murali krishna
టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో జయలలిత, శోభన్ బాబు ఈ జంట గురించి  తెలియని వారు లేరు. ఒకసారి పెళ్లయిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండే రోజులు ఇవి.
కానీ శోభన్ బాబు మరియు జయలలిత ఒకరినొకరు ఎంతో పవిత్రంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ వారి జీవితం ముందుకు సాగడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు దాటాలని ఎంతో ప్రయత్నించారు ఇద్దరు. కానీ అది నెరవేరలేదు ఆ ప్రేమ కథ కాలం చెప్పిన కథగా మిగిలిపోయింది. అయితే దానికి సజీవ సాక్షాలు అంటూ లేకపోయినా ఆ టైంలో జయలలితతో ఎంతో స్నేహంగా ఉన్నావు ఒక వ్యక్తి అప్పుడు అసలు ఏం జరిగింది, వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనే విషయాలను ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకోవడంతో వెలుగులోకి వచ్చాయి.
జయలలితకు అప్పటికే పెళ్లయిన శోభన్ బాబుతో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఒకరిని ఒకరు విడిచిపెట్టలేనంత ఆ బంధంగా మార్చుకున్నారు. శోభన్ బాబు మొదటినుంచి జయలలితను ఇష్టపడుతున్న మరోవైపు భార్యను కూడా విడిచిపెట్టలేక పోయారు. తన మాస్టారుకు ఇచ్చిన మాట కోసం అతడి కూతుర్నే వివాహం చేసుకున్న శోభన్ బాబు ఆమెను మోసం చేసి మరొక పెళ్లి చేసుకుంటే ద్రోహిగా మిగిలిపోతానని జయలలితకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. నిన్ను ప్రేమిస్తున్నాను కానీ పెళ్లి చేసుకోలేను అనే మాట శోభన్ బాబు ఆది నుంచి వారు విడిపోయే వరకు చెప్పాడు అనేది నిజం.
ఇక ఈ విషయాలను మీడియాతో చెప్పింది మరి ఎవరో కాదు కుట్టి పద్మిని. జయలలిత, పద్మిని ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. శోభన్ బాబు, జయలలిత ప్రేమకు ఆమె ప్రత్యక్ష సాక్షి. కానీ జయలలితను వదులుకోవడానికి శోభన్ బాబు మనసు ఒప్పుకోలేదు. అలాగే శోభన్ బాబుని కూడా పెళ్లి చేసుకోవాలని జయలలిత మొండి పట్టు పట్టింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తనను భార్యగా చేసుకోమని ఎంతగానో బలవంతం చేసింది.చివరికి ఒక పెళ్లి రోజు ముహూర్తం కూడా ఖరారు చేసింది జయలలిత. అందుకోసం పెళ్లి నగలు, వడ్డానం, బంగారం అన్ని సిద్ధం చేసుకుని శోభన్ బాబుని రమ్మని చెప్పింది. ఆ రోజు శోభన్ బాబు బయలుదేరి జెమినీ స్టూడియోస్ వరకు వచ్చాడు కానీ మధ్యలో కాలం అంతా గిర్రున తిరిగినట్టుగా వాస్తవ స్థితికి వచ్చిన శోభన్ బాబు జయలలిత ఇంటికి ఫోన్ చేసి తాను పెళ్లికి రాలేనని నన్ను క్షమించాలని కోరాడు. ఇది పద్మిని సమక్షంలోనే జరిగింది అని ఆమె తెలిపారు. ఈ ఈ సంఘటన తర్వాత జయలలిత బాగా కృంగిపోయారు కానీ మరింత ఉత్సాహంతో కెరియర్లో ముందుకు సాగారు. ఈ విషయాన్ని జయలలిత బయోపిక్ లో కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు కానీ ఆ నటుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పకపోవడం విశేషం ఇక పద్మిని చెప్పిన విషయంతో అతడే శోభన్ బాబు అని అర్థమైంది.
ఈ మూవీ వల్ల జయలలిత గూర్చి చాలా తెలియని ఇన్ఫర్మేషన్ సినిమా ద్వారా మనం పొందాము అని నేటిజన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: