బాలయ్య సరసన మళ్ళీ మెరవనున్న ' హనీరోజ్' ....!!

murali krishna
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరో గా నటించిన వీర సింహారెడ్డి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన మలయాళీ బ్యూటీ హనీ రోజ్  బొద్దుగా అందంగా ఉందంటూ తెలుగు అభిమానులు కూడా ఫిదా అయ్యారు.
బాలకృష్ణ మరోసారి ఈమె తో నటించాలని కోరుకుంటున్నాడని ప్రచారం జరిగింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా లో హనీ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు కాస్త లావుగా బొద్దుగా ఉన్న హనీ ఇప్పుడు సన్నగా మారింది. తెలుగు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఈమె సన్నగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
వీర సింహా రెడ్డి సినిమా లో బాలకృష్ణ కు తల్లి పాత్రలో కూడా కనిపించాలని కాస్త ఎక్కువ వెయిట్ మెయింటైన్ చేసిన ఈమె ముందు ముందు తెలుగు లో యంగ్ స్టార్ హీరోలకు జోడి గా నటించడం కోసం సన్నబడ్డట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా తాజాగా ఈమె షేర్ చేసిన చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చీర కట్టులో హనీ చాలా క్యూట్ గా అందంగా సన్నగా నాజూకుగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ఫిజిక్ మెయింటైన్ చేస్తే కచ్చితంగా తెలుగు సినిమాల్లో బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ఇప్పటికే చాలా మంది కేరళ ముద్దుగుమ్మలు ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ గా కూడా కేరళ బ్యూటీలు టాలీవుడ్ లో నిలిచారు. కనుక ఈమె కూడా ప్రయత్నిస్తే తప్పకుండా తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే మొన్న జనవరి నెలలో వచ్చిన వీరసింహ రెడ్డి సూపర్ హిట్ అవ్వడంతో వీళ్ళ కాంబినేషన్ పై అభిమానులకు మంచి నమ్మకం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: