బాలయ్యతో అదిరిపోయే ప్లాన్ చేస్తున్న ప్రముఖ "ఓటిటి" సంస్థ..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా లతో అలాగే "ఓ టి టి" షో లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఇప్పటికే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి  ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అన్ స్టాపబుల్ సీజన్.1 మరియు సీజన్ 2 లకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఆహా "ఓ టి టి" లో ప్రసారం అయిన ఈ టాక్ షో రెండు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ ఈ రెండు సీజన్ లను కూడా అదిరిపోయే రేంజ్ విజయం సాధించేలా చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో తో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానితో మరో ప్రముఖ "ఓ టి టి" సంస్థ కూడా బాలయ్య తో ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందులో భాగంగా ఆ ప్రముఖ "ఓ టి టి" సంస్థ బాలయ్య తో వెబ్ సిరీస్ కు సంబంధించిన సంప్రదింపులను కొనసాగిస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం తో ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: