టెస్లా కార్ల నాటు నాటు పెర్ఫార్మన్స్ కి రాజమౌళి ఫిదా?

Purushottham Vinay
ఇక ఇండియన్ సినిమాలలో ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు.ఇంటర్నేషనల్ స్టేజి పై గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ సొంతం చేసుకోవడమే కాకుండా..ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఏకంగా గెలిచిన ఆస్కార్ కైవసం చేసుకుని భారతీయ చరిత్రలో నిలిచింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. అసలు ఈ పాటకు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్లతో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రదర్శించిన ఓ స్పెషల్ వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. ఈ వీడియో చూసిన ఎస్ ఎస్ రాజమౌళి స్పందిస్తూ..చాలా అద్భుతమంటూ కొనియాడారు.


'న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా నేను పొంగిపోయాను. మీ అందరికీ నా ధన్యావాదాలు. ఇంతటి అద్భుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు.నాటు నాటు పాటకు టెస్లా కార్లతో లైట్ షో ఒక అద్భుతమైన అనుభూతి' అని అంటూ పోస్ట్ చేశారు ఎస్ ఎస్ రాజమౌళి.ఇక ఆర్.ఆర్.ఆర్ పెద్ద గ్లోబల్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఎస్ ఎస్ రాజమౌళి భారీ అడ్వెంచర్ చిత్రం చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలలో చాలా సార్లు స్పందించారు రాజమౌళి. త్వరలోనే వీరిద్దరి కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: