మహేష్ vs చిరు.. బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్?
దీంతో ఫాన్స్ అందరు కూడా కన్ఫ్యూషన్ లో పడిపోయారు అని చెప్పాలి. ఎందుకంటే అదే సమయంలో ఇక మరో స్టార్ హీరో సినిమా కూడా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా బోలా శంకర్ సినిమా రిలీజ్ రోజునే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు అన్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే నిర్మాత నాగ వంశీ ఇక ఈ విషయాన్ని ప్రకటించాడు. మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న కాగా ఇక మహేష్ సినిమా 11న రిలీజ్ అవుతుండడంతో ఇక వరుసగా సెలబ్రేషన్స్ అని ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
కానీ ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం అదే రోజున తన సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయించుకుని డేట్ కూడా ప్రకటించాడు. దీంతో గందరగోళం నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే ఏదో ఒక సినిమాకు నష్టాలు తప్పవు. అందుకే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వెనక్కి లేదా ముందుకు జరగాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. అయితే బోలా శంకర్ షూటింగ్ సక్రమంగానే జరుగుతుండగా.. త్రివిక్రమ్, మహేష్ బాబు కొంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మాత్రం కాస్త నత్తనడకన నడుస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆగస్టు వరకు ఏ సినిమా ముందుకు వస్తుంది. ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.