పవన్ సినిమా అంటే నో అంటున్న హీరోయిన్..!!

Divya
సోషల్ మీడియాలో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ మాళవిక మోహన్. ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల పైన తాజాగా మాళవిక మోహన్ క్లారిటీ ఇస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది.

మాళవిక మోహన్ తన ట్విట్టర్ నుంచి ఇలా షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉంది..కానీ నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో భాగం కావడంలేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను ప్రస్తుతం అద్భుతమైన తెలుగు సినిమాలో నటిస్తున్నానని ఇందులో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేసింది. సెకండ్ ఫిమేల్ కాదని ఇది తన తెలుగు సినిమాకి డబ్ల్యు ప్రాజెక్టు కావడం చాలా ఎక్సైటింగ్ గా ఉందంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ హర్రర్ సినిమాలో మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఇప్పటికే సెట్స్ రెడీ అయింది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.ఈ విషయం పైన కూడా చిత్ర బృందం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి మాళవిక మోహన్ ఇచ్చినట్టుగానే శ్రీ లీల కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల హీరోయిన్ల పైన పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: