తన భర్త మూవీపై రమ్యకృష్ణ నెగటివ్ కామెంట్స్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఉగాది పండుగ సందర్భంగా మర్చి 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత  సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకేకించిన ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఇంకా అలాగే రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారని.. వారి నటనతో కట్టిపడేశారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో నటి రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.రమ్య కృష్ణ మాట్లాడుతూ.." ఈ మూవీ స్టార్ట్ కాక ముందు.. ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని తన భర్త అయిన  కృష్ణవంశీని అడిగానని రమ్యకృష్ణ అన్నారు. రంగమార్తాండ నటసామ్రాట్ సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే.


అయితే నటసామ్రాట్ సినిమాను నేను చూశాను. ఇలాంటి సినిమాను తీస్తే ఎవరు చూస్తారు అని నేను నా భర్త కృష్ణవంశీని అడిగాను..అయితే ఆయన మాత్రం తన మాట అసలు వినకుండా ఈ సినిమాను మొదలు పెట్టేశారట. ఇంకా అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మందిని సంప్రదించారు. ఎవ్వరూ కూడా సెలక్ట్ కాకపోవడంతో చివరికి నేను ఆ పాత్ర చేశాను అన్నారు రమ్యకృష్ణ. నేను ఎమోషనల్ సినిమాలు ఎక్కువగా చూడను. కానీ ఈ సినిమాలో నేను కళ్లతోనే నటించాలని నా భర్త కృష్ణవంశీ చెప్పారు" అని రమ్యకృష్ణ అన్నారు.ప్రస్తుతం రమ్య కృష్ణ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక చూడాలి చాలా కాలం తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో..కృష్ణ వంశీ చివరిసారిగా నక్షత్రం సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: