పవన్ తో మూవీ చేయడానికి అన్ని సంవత్సరాలు నుండి వెయిట్ చేస్తున్నాను... దానయ్య..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రొడ్యూసర్ లలో v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఒకరు. ఈయన ఇప్పటికే డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనేక భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజ్ ఉన్న ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ప్రొడ్యూసర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు మరియు డి వి వి దానయ్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ప్రొడ్యూసర్ అనేక క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "ఓ జి" అనే ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానయ్య ... పవన్ కళ్యాణ్ తో చేయబోయే మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా దానయ్య మాట్లాడుతూ ... మూడు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికి పవన్ తో సినిమా సెట్ అయింది అని దానయ్య చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ... దానయ్య కాంబినేషన్ లో రూపొందబోయే "ఓజి" మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: