రామ్ ... బోయపాటి మూవీ విడుదలపై క్రేజీ న్యూస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మాస్ ... క్లాస్ మూవీ లలో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరు గా ది వారియర్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించాడు.

 తమిళ దర్శకుడు లింగు సామి దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి అంచనాలను నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఈ మూవీ లో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు.

 ఈ మూవీ రామ్ మరియు బోయపటి కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో శ్రీ లీల ... రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఊర్వసి రౌటెల ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని జూలై నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: