చివరి దశకు చేరుకున్న రజనీకాంత్ "జైలర్" మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ... రమ్య కృష్ణ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ షూటింగ్ ను కూడా ఈ మూవీ బృందం ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం జైల్ సెట్ లోనే పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఈ చిత్ర బృందం జైల్ సెట్ ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ కి సంబంధించిన కేవలం చివరి షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ ను కూడా ఈ మూవీ యూనిట్ మరి కొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ ను ఏప్రిల్ రెండవ వారం వరకు పూర్తి చేయాలి అని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు ... అందుకు అనుగుణంగా ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: