రామ్ చరణ్ పుట్టినరోజు నాడు "ఆర్సి16" నుండి క్రేజీ అప్డేట్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో శ్రీకాంత్ , సునీల్ , అంజలి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తుండగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందే మూవీ లో హీరో గా నటించనున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందిపోతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. అలాగే నవంబర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్ట బోతున్నట్లు రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. అలాగే ఈ మూవీ లోని పాత్ర రంగస్థలం లోని చిట్టి బాబు పాత్ర కంటే పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఒక వెలువడిపోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: