"ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఈ హీరో కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సైరా నరసింహా రెడ్డి మూవీ తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ తో సాక్షి వైద్య హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ నుండి రెండవ పాటను కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం నిర్వహించనున్నట్లు ... ఆ వేడుక కు టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: