లెజెండ్ దాసరి పై.. ఆ సీనియర్ నటుడు చేయి చేసుకున్నారా?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిత్ర పరిశ్రమకు మొత్తం పెద్దగా భావించిన వారు.. ఇక ఏకంగా సినీ నటీనటులు అందరూ కూడా గురువుగారు అనే ప్రేమగా పిలుచుకున్న వ్యక్తి ఒకే ఒక్కరు అని చెప్పాలి. ఆయన ఎవరో కాదు దాసరి నారాయణరావు. దర్శకుడిగా నటుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు అని చెప్పాలి. ఎన్టీఆర్ మరణం తర్వాత ఇండస్ట్రీ బాధ్యతలు మొత్తం భుజాన వేసుకొని ముందుకు నడిపించారు దాసరి నారాయణరావు. ఇక అప్పట్లో దాసరి మాట ఇండస్ట్రీలో వేదవాక్కుగా కొనసాగేది .

 దాసరి ఏం చెబితే అదే జరుగుతుంది అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే అలాంటి దాసరి నారాయణరావుపై ఓ సందర్భంలో సీనియర్ నటుడు కాంతారావు చేయి చేసుకున్నారు అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ హీరోగా నాగభూషణం నిర్మాణ భాగస్వామిగా ఒకే కుటుంబం సినిమాను నిర్మించారు. సినిమాకు భీమ్ సింగ్ దర్శకుడు. కాగా ఆయనకు అసోసియేట్ గా దాసరి పనిచేస్తుండేవారు. అదే సమయంలో భీమ్ సింగ్ కు హిందీలో దిలీప్ కుమార్ గోపి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందట.

 అయితే ఈ విషయాన్ని ముందుగా ఎన్టీఆర్కు తెలియజేసి ఇక ఆయన పర్మిషన్ ఇవ్వడంతో ఇక వెంటనే బాలీవుడ్ లో ఒక సినిమాను చేసేందుకు వెళ్లారట దర్శకుడు భీమ్ సింగ్. ఇక వెళ్తూ వెళ్తూ దాసరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అయితే భీమ్ సింగ్ లేకుండానే సినిమాలు పూర్తి చేశారు దాసరి. ఇక అతని ప్రతిభకు మెచ్చిన ఎన్టీఆర్ గొప్ప దర్శకుడివి అవుతావు అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అదే సినిమాలో ఎన్టీఆర్కు అన్నగా కాంతారావు నటిస్తున్నారు. ఒకరోజు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చారట. దీంతో ఎన్టీఆర్ అతనిపై కేకలు వేశారట. ఇక ఆ సమయంలో హడావిడిగా రెడీ అవుతున్న కాంతారావు దగ్గరికి వెళ్లి డైరెక్టర్ దాసరి సీన్ వివరించబోతుండగా అసలే హడావిడిలో ఉన్న కాంతారావు దాసరి చెంప మీద లాగి ఒక్కటి ఇచ్చారట. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చి మిగతా సినిమాని దాసరి పూర్తి చేస్తాడు అని చెప్పడంతో కాంతారావు కంగుతిని సారీ చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: