రంగమార్తాండ: ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఇంకా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్రిమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక ఉగాది పండుగ కానుకగా ఈనెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని హౌల్ఫుల్ మూవీస్ ఇంకా అలాగే రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా సంగీతం అందించారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనాల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ట్రైలర్ ని కనుక చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించినట్లుగా కనిపిస్తోంది. 


ఎమోషన్స్, డైలాగ్స్ అయితే మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాలో బాగా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను ఇలా సినిమాగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. “ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమంతా నాటకం.. జగన్నాటకం” అంటూ కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఎంతగానో ఆసక్తిని కలిగిస్తోంది.ఈ సినిమాలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ వంటి యంగ్ యాక్టర్స్ కీలకపాత్రలలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మార్చి 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి.మరి చూడాలి ఆ అంచనాలని అందుకోని ఈ సినిమా హిట్ అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: