చమ్కీల అంగీలేసి " సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

Divya
పుష్ప సినిమాలోని ఊ అంటావా.. పాటలు పాడి ఓవర్ నైట్ లోనే భారీ స్టార్ సింగర్ అయిపోయింది మంగ్లీ సోదరి. ఇప్పుడు మరో సింగర్ కూడా అలాగే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సింగర్ పేరే ధీ.. రీసెంట్గా దసరా సినిమా నుండి చమ్కీల అంగీలేసి అనే పాటతో యూట్యూబ్లో షేర్ చేసింది ఈ అమ్మడు ఈ పాటకు ఊహించని విధంగా మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి ఎవరు అని సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే మొదటిసారి ఈ పాట విన్నప్పుడు సంగీత ప్రియులు అందరూ ధీ పక్క తెలుగమ్మాయి అని అనుకున్నారు. కానీ ఈమె పక్కా తెలుగు అమ్మాయి కాదు పక్క తమిళ్ అమ్మాయి..
ఈమె అసలు పేరు దీక్షిత.. అయితే అందరూ ముద్దుగా ధీ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఈమె సోషల్ మీడియా ఖాతాలో కూడా ఈమె పేరు ధీ అని ఉంటుంది.. ఇక ఈమె తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు నారాయన్ అయితే ఈమె ఇండియాలోనే పుట్టినప్పటికీ కూడా ఆస్ట్రేలియాలోని తన చదువును పూర్తి చేసింది.. ఇక పుట్టినప్పటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఎవ్వడు 14 ఏళ్లకే సంగీతం నేర్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ధీ ఒక్క దసరా సినిమాలోని పాఠ మాత్రమే కాదు తెలుగులో ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది..
గురు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ లలో ఒకటైన ఓ సక్కనోడా పాట కూడా ఈమె పాడింది. అలాగే మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాటను కూడా ఈ అమ్మాయే పాడి అలరించింది. అలాగే ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ ని బాగా షేక్ చేశాయి. కానీ చంకీల అంగీ లేసి పాట మాత్రం ఒక ఊపు ఊపడంతో అందరూ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెగ వెతికేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో కూడా మీకు క్రేజ్ పెరగడంతో ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: