"దాస్ కా దమ్కి" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దాస్ కా దమ్కి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా భారీగా నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ చిత్ర బృందం  క్లోజ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో ఈ మూవీ కి 3 కోట్ల ప్రీ రిలీజ్ ను జరుపుకోగా ... సీడెడ్ లో ఒక కోటి ... ఆంధ్రాలో 2.5 కోట్లు ... కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ కి 70 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: