నా ఫేవరెట్ క్రికెటర్ అతనే ... నాని..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీbలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి నాని తాజాగా దసరా అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించ బోతున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే తేదీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను ... ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను జోరుగా నిర్వహిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నాని వైజాగ్‌ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెకండ్ వన్డే ఇంటర్నేషనల్‌లో దసరా మూవీ ని ప్రమోట్ చేశాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని అడిగిన ప్రశ్నకు ... అది భారత కెప్టెన్ రోహిత్ శర్మ అని నాని చెప్పాడు. అయితే తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అని నాని చెప్పాడు. క్రికెట్‌ను ఇష్టపడేలా చేసింది సచినే అని నాని తాజాగా పేర్కొన్నాడు. ఇలా నాని ప్రస్తుతం తాను హీరోగా రూపొందిన దసరా మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: