ఉగాదికి పవన్ ... సాయి తేజ్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేనట్టేనా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన వినోదయ సీతం ఒరిజినల్ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే పవన్ ... సాయి తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు రీమిక్ కు కూడా ఈ దర్శకుడే దర్శకత్వం వహిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి హీరోయిన్ లు ఉండరు ... కానీ ఈ సినిమాలో సాయి తేజ్ సరసన హీరోయిన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి పాటలు కూడా ఉండవు. కాకపోతే ఈ సినిమా తెలుగు రీమిక్ లో రెండు పాటలు ఉండబోతున్నట్లు సమాచారం.

అందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా ... మరొకటి సాధారణ సాంగ్ అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ప్రకటించలేదు. దానితో ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ ఉగాది సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ ఉగాది కి విడుదల చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మరి ఈ ఉగాది కి ఈ సినిమా టైటిల్ ను విడుదల చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: