మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "ఊర్వశివో రాక్షసివో" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన నటులలో అల్లు శిరీష్ ఒకరు. ఈయన గౌరవం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించిన ఈ యువ హీరో శ్రీరస్తు శుభమస్తు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించిన ఈ హీరో కు మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ... రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ విజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో జెమినీ సంస్థ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేసింది. మరి ఈ మూవీ కి బుల్లితెరపై ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ మరియు GA2 పిక్చర్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: