"మగధీర" మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫెయిల్ అయిన తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన మగధీర మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కలెక్షన్ ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఈ మూవీ తో రాజమౌళి ... రామ్ చరణ్ ... కాజల్ అగర్వాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడంతో కొంత మంది తెలుగు సినీ దర్శకులు ఇదే పందాలో కొన్ని సినిమాలను తెరకెక్కించారు.

 ఆ సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల క్రితం అనగనగా ధీరుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ ని అశ్విని దత్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్ గ వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాథ్ సినిమాను అల్లు అరవింద్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మూడు మూవీ లు కూడా మగధీర మూవీ కి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. కాకపోతే ఈ మూడు మూవీ లు కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ ను సాధించలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: