హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ ఇండియా మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాకు అదిరిపోయే రేంజ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. సౌత్ ఇండియా నుండి విడుదల అయ్యే సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సౌత్ ఇండియా సినిమాలకు కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో దక్కుతున్నాయి. అందులో భాగంగా సౌత్ ఇండియా నుండి విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా సౌత్ ఇండియా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి 1810 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయినా సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సౌత్ ఇండియా నుండి విడుదల అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1236.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1233 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రజినీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి మొదటి భాగం 605 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: