"రంగమార్తాండ" టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలంగా వరస పరాజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలా పడిపోయిన కృష్ణ వంశీ ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని తిరిగి కం బ్యాక్ అవుతాడు అని చాలా మంది ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ లో బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కి ఇళయరాజా సంగీతం అందించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కాలిపు మధు , ఎస్ వెంకట్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా లోని ప్రధాన పాత్రధారులందరూ కనిపించిన ఈ టీజర్ ఎమోషనల్ , హార్ట్ టచింగ్ అంశాలతో ప్రేక్షకులం ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇలా ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని కొంత మంది సినీ ప్రముఖులకు స్పెషల్ వేయగా వారి నుండి ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: