ఆస్తులు పోగొట్టుకున్న కీరవాణి తండ్రి.. కారణం...!!

murali krishna
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిపోయిందని చెప్పాలి.ఇలా ఆస్కార్ రావడానికి కీరవాణి రాజమౌళి పాత్ర ఎంతో ఉందని చెప్పాలి ఇలా ఆస్కార్ వేదికపై సందడి చేసినటువంటి కీరవాణి రాజమౌళి ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించారని చాలామందికి తెలియదు.
తాజాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఒకప్పుడు తమ కుటుంబం అనుభవించిన పేదరికం గురించి తెలియజేశారు. మొత్తం తాము నలుగురు అన్నదమ్ములమని తెలిపారు. తుంగభద్ర తీరానికి వలస వెళ్ళాం. పదహారు సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాము. ఐతే అక్కడ నేను మూడు వందల ఎకరాల పొలం కొన్నాము.అయితే చిన్నప్పటినుంచి సినిమాలపై పిచ్చి ఉండడంతో సినిమాల కోసమే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నామని ఈయన తెలియజేశారు. ఇలా ఆస్తులు పోవడంతో రోజు గడవడం కూడా కష్టంగా మారి కటిక పేదరికం అనుభవించామని తెలిపారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు. కీరవాణి సంపాదనే మమ్మల్ని బ్రతికించింది. కీరవాణి ప్రతిభ కలవాడు చిన్నప్పటినుంచి తనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో తనకి సంగీతం నేర్పించానని ఆయన తెలియజేశారు. నేను తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ కలిసి కథారచయితలుగా పని చేశాము. జానకిరాముడు, కొండవీటి సింహం వంటి హిట్ చిత్రాలకు కథలు అందించామని చెప్పుకొచ్చారు. ఇలా ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించినటువంటి రాజమౌళి కీరవాణి నేడు ఆస్కార్ స్థాయి వరకు వెళ్లడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా కీరవాణి తండ్రి తెలియజేశారు. ఇలా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏదేమైనా పట్టుదల, శ్రమ అనేవి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు అనేదానికి నిదర్శనం గా నిల్చిన వ్యక్తుల్లో కీరవాణి మరియు రాజమౌళి గారు ఉంటారనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అని నేటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: