ఎన్టీఆర్ హీరోయిన్ పై ఆ డైరెక్టర్ లైంగిక దాడి..!!

Divya
గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పాయల్ ఘోష్. ఈ అమ్మడు మంచు మనోజ్ నటించిన ప్రయాణం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో అందరికీ సుపరిచితురాలు అయ్యింది. గత కొద్దిరోజులుగా ఈమె సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తోంది.

ఇటీవల తన సూసైడ్ లెటర్ ను స్వయంగా ఇన్స్టాగ్రామ్ లేదు కదా షేర్ చేసింది పాయల్ ఘోష్. ఇక సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఈ విషయం పైన కామెంట్లు చేయడం జరిగింది. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక సంచలన విషయాన్ని తెలియజేయడం జరిగింది. గతంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి అదే విషయాన్ని తెలియజేస్తోంది ఈ అమ్మడు.

నేను సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో రెండు నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్లతో పని చేశాను.. ఎంతోమంది హీరోలతో పని చేశాను ఎవరు కూడా నన్ను ఏ విధంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో పనిచేయలేదు.. అతనిని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు ఎందుకు నేను సౌత్ గురించి గొప్పగా చెప్పుకోకూడదు చెప్పండి అంటూ తెలియజేస్తోంది అలాగే ఎన్టీఆర్ తో కలిసి పని చేశాను అతను కూడా తనతో అనుచితంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు ఆయన ఒక జెంటిల్మెన్ అందుకే నాకు సౌత్ ఇండస్ట్రీలో ఉండేవారు అంటే చాలా ఇష్టం అంటూ వరుస ట్వీట్ లను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: