టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియా మూవీస్..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో మూవీ లు విడుదల అయ్యి ... ఎన్నో మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికీ వరకు ఇండియా నుండి విడుదల అయ్యి అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
దంగల్ : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ వసూలు చేసింది. ఈ మూవీ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1958 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
బాహుబలి 2 : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా 1810 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది. ఈ భారీ బ్లాక్ బాస్టర్ మూవీ లో ప్రభాస్ హీరో గా నటించగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు.
ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలగా రూపొందిన ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆలియా భట్ ... ఓలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1236.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1233 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1048 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: