చరణ్ అవమానించేందుకే ఇలా చేస్తున్నారా..?

Divya
రామ్ చరణ్ కెరియర్ లో ఘోరమైన డిజాస్టర్ సినిమా ఏమిటంటే ఆరంజ్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ అభిమానులకు విసుగు తప్పించేలా ఉంటుంది. ఈ సినిమా రామ్ చరణ్ ఎందుకు చేశారా అని ప్రతి ఒక్క అభిమాని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జెనీలియా ఈ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా గోరంగా డిజాస్టర్ కావడంతో నాగబాబు నిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరించి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. ఈ నష్టం నుంచి చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు నాగబాబు.

రామ్ చరణ్ కెరీర్ ని ఒక్కసారిగా డౌన్లోడ్ చేసిన సినిమా ఆరంజ్ ఈ సినిమా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాండ్ ఇండియా హీరోగా పేరుపొందిన రామ్ చరణ్ కు తన బర్తడే సందర్భంగా ఇలాంటి ఘోరమైన డిజాస్టర్ సినిమాని రీ రిలీజ్ చేస్తూ ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మొదట మగధీర సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించగా ఏవేవో కారణాల చేత ఆరంజ్ సినిమాని విడుదల చేస్తున్నారు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇదంతా కావాలని ఎవరు చేయిస్తున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే ఒక ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: