ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న "దసరా" మూవీ సాంగ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

 మూవీ ని ఈ నెల 30 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళం భాషలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ఆ పాటలలో నుండి చమ్కీల అంగీలేసి అనే పల్లవి తో సాగే మంచి మెలోడియస్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తోంది. దానితో ఈ సాంగ్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ కూడా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 14 మిలియన్ వ్యూస్ ... 290 కే లైక్ లు లభించాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ని రామ్ మిరియాల, ఢీ చాలా సూపర్ గా పాడారు. సినిమా విడుదల కాక ముందు లిరికల్ వీడియో తోనే అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటున్న ఈ సాంగ్ కు సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: