అయ్యో! చరణ్ విషయంలో ఎన్టీఆర్ చెప్పిందే జరిగిందిగా..!!

murali krishna
RRR మూవీ కి రీసెంట్ గానే 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరీ లో 'నాటు నాటు' పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఊగిపొయ్యెలా చేసిన ఈ పాటకి అంత అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది అంటే దానికి కారణం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మాత్రమే అని చెప్పాలి..
వాళ్ళు వేసిన అద్భుతమైన డ్యాన్స్ వల్లే ఇది సాధ్యపడిందని చెప్పొచ్చు..రాజమౌళి టేకింగ్ అలాగే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ మరియు రామ్ చరణ్ - ఎన్టీఆర్ మెరుపు వేగంతో వేసిన స్టెప్పులు, ఈ పాటకి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టేలా చేసాయి..అయితే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ మరియు మూవీ టీం మొత్తం  కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు.కానీ రామ్ చరణ్ కి మాత్రం ఢిల్లీ లో నేడు నిర్వహించిన 'ఇండియా టుడే కాంక్లేవ్' మీటింగ్ లో పాల్గొనేందుకు ఆహ్వానం పొందాడు..
అక్కడ వేదిక మీద కాసేపటి వరకు జరిగిన చిట్ చాట్ లో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. rrr మూవీ తో తనకి ఏర్పడిన జ్ఞాపకాలు మరియు ఎన్టీఆర్,రాజమౌళి తో గడిపిన మధుర క్షణాలతో పాటుగా భవిష్యత్తులో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడటా..అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చివర్లో ఆయనని ఇండియా టుడే వారు 'నాటు నాటు' పాటలోని హుక్ స్టెప్ ని వేయాల్సిందిగా ఆయనను కోరారు.అప్పుడు రామ్ చరణ్ మాట్లాడుతూ 'నిజంగా నాకు స్టెప్పు అస్సలు గుర్తు లేదు సార్.ఇలాంటి వేదికల మీద అసలు వెయ్యలేను' అంటూ అయితే చెప్పుకొచ్చాడు.
కానీ 'వెయ్యాలి వెయ్యాలి' అంటూ అక్కడ ఉన్నవాళ్ళందరూ పట్టుబట్టడం తో 'నాటు నాటు' పాటకి స్టెప్పులు వెయ్యాల్సి వచ్చిందటా..కానీ ఆయన వేసిన స్టెప్పులు మర్చిపోయి వేసినట్టే అనిపించిందని తెలుస్తుంది..ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూస్ అప్పుడే చెప్పాడు, రామ్ చరణ్ కి మతిమరపు కొద్దిగా ఎక్కువ అని, అది ఈరోజు నేషనల్ మీడియా వేదికగా అయితే బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: