ఆ తప్పు చేయడం వల్లే ఇపుడు మెగాస్టార్ ఈ స్థాయి లో ఉన్నారు.....!!

murali krishna
ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉన్నా సీనియర్ స్టార్ హీరో మన మెగాస్టార్చిరంజీవి. ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన కి తెలిసిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో లేకపోవడం తో ఆయనకి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు అయితే ఇండస్ట్రీ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనతో పాటు ఆయన రూమ్మెట్స్ గా హరి ప్రసాద్, సుధాకర్ ఇద్దరు ఉండేవారు వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా ఆఫీస్ లకి వెళ్లి ఆడిషన్స్ ఇస్తు ఉండేవారు అలా ఒకానొక టైం లో వీళ్ళకి తినడానికి తిండి కి కూడా డబ్బులు ఉండేవి కావు, అలాంటి టైమ్ లో కొన్ని సార్లు పస్తులు కూడా ఉండేవాళ్ళు ఇలా చాలా ఇబ్బందులు పడుతూ బతికారు అలా ఆర్థికం గా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒకరోజు సుధాకర్ ఇవాళ్ళ ఏ కర్రీ చేసుకుందాం అని వీళ్లతో అంటుంటే సుధాకర్ కి వాళ్ల పక్కింట్లో ఒక ములక్కాయ చెట్టు కనిపించింది, గోడ ఎక్కి ఆ ములక్కాయలు మొత్తం తెంపి కర్రీ వండారు అలా వండుకున్న కర్రీ ముగ్గురు వేసుకొని తింటుంటే ఆ పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయలే తెంపుతావా అంటూ వచ్చి పెద్ద గొడవచేసాడట.
ఐతే వాళ్ళు వండుకున్న కర్రీ కూడా తీసుకొని వెళ్ళాడట అలా జరగడం తో వాళ్ళకి చాలా అవమానం అనిపించిందట ఆ తరువాత వాళ్ళు ఇంకా కసి గా ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. అలా ఇప్పుడు ఒక గొప్ప స్థాయి లో ఉన్నారు.అందుకే కసి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి చిరంజీవి, సుధాకర్ గారిని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీ గా ఉండగా సుధాకర్ సినిమాలు ఏమి చేయకుండా ఖాళీగా ఉన్నాడు ఒకప్పుడు టాప్ కమెడియన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఒక్క సినిమా ఇండస్ట్రీలో నే కాదు మనం చేసే ఏ పనిలోనైనా కసి, పట్టుదల ఉంటే మాత్రం ఉన్నత స్థాయి కి ఏదుగుతాము అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: