ఆ "ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైటర్ పద్మభూషణ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సుహాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకొని ... ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ యువ హీరో కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ మూవీ థియేటర్ లలో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో  విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాగే ఈ మూవీ లో సుహస్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలు కూడా లభించాయి. దానితో ప్రస్తుతం సుహస్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల్లో హీరో అవకాశాలు కూడా లభిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ యువ హీరో రైటర్ పద్మభూషణ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

ఇలా థియేటర్ లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి  ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జీ 5 సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా మార్చి 17 వ తేదీ నుండి జీ 5 సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీకి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: