పుష్ప-2 లో ఆ సీన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు....!!

murali krishna
టాలీవుడ్ స్టార్స్ లలో ఐకాన్ స్టార్ గా పిలవబడుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికి తెలిసిందే.
ఐతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం "పుష్ప: ది రూల్" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. "పుష్ప 1" మూవీ లో యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి అని చెప్పుకోవచ్చు.
ఐతే ఈ నేపథ్యంలో పుష్ప సెకండ్ పార్ట్ లో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ లో కూడా అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించి ఒక యాక్షన్ ఫైట్ సీన్ షూటింగ్ పూర్తయిందట. ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ ఎవరితో ఫైట్ చేశారో తెలుసుకోవాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా లో మొత్తం అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో బాగా కాస్ట్లీ బట్టలు వేసుకుని కనిపిస్తారట. సినిమాలో బన్నీ చాలా రకాల రిచ్ బట్టల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఏదేమైన సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప -1 చాలా పెద్ద హిట్ అయ్యేటప్పటికి ఆయన మీద పుష్ప 2ఒత్తిడి పడిందనే భావించాలి. చూడాలి మరీ ఈ మూవీ ఇంకెంత హిట్ కొడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: