చంకీల అంగీ యేసి పాట.. బ్రహ్మానందం వెర్షన్ లో?

praveen
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నేటి రోజుల్లో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు అన్న విధంగానే మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుకుని తమకు నచ్చిన విధంగా ఏదో ఒకటి చేసేస్తూ ఉన్నారు నేటిజన్స్. ముఖ్యంగా సినిమా పాటలను ఎడిట్ చేస్తూ ఇక అందరికీ నవ్వులు తెప్పించే విధంగా తయారుచేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నానీ సరసన కీర్తి సురేష్ నటిస్తూ ఉంది అని చెప్పాలి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.

 ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల నోట నానుతూనే ఉన్నాయి. అందులో ఒకటి చెంకీల అంగీ ఏసి ఓ వదినే అంటూ ఒక సాంగ్ ఉంటుంది. రామ్ మిర్యాల, ది కలిసి ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక నేటిజన్ ఏకంగా చెమికీల అంగీ యేసి అనే పాటను బ్రహ్మానందం వర్షన్ లో క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదలడంతో ఇక ఇది చూసి నెట్టిజెన్స్ అందరు పగలబడిన అనుకుంటున్నారు. ఈ పాటలోని ప్రతి లిరిక్ కి కూడా బ్రహ్మానందం సినిమాలోని సీన్స్ సరిపోయేలా ఎడిట్ చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: