ఉగాదికి "ఎన్బికే 108" నుండి అదిరిపోయే అనౌన్స్మెంట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ ల విజయాలతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను ఈ ఉగాది కి ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు ... ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నట్లు ... అలాగే ఈ టైటిల్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: