"రంగమార్తాండ" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ చాలా సంవత్సరాల క్రితం దర్శ కత్వం వహించిన చందమామ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసు కున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు అనేక మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇలా వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటున్న ఈ క్రియేటివ్ దర్శకుడు తాజాగా రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు .

ఈ మూవీ మరాఠీ సినిమా అయినటువంటి సామ్రాట్ అనే మూవీ కి అధికారిక రూపొందింది. ఈ రీమేక్ మూవీ లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజ శేఖర్, అన సూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ మూవీ కి మెగాస్టార్ చిరంజీవి షాయరీ అందించారు. ఈ షాయరీ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించింది

తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయక అవి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఏరేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మార్చి 22 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: