దసరా మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజా గా ఊర మాస్ మూవీ అయినటు వంటి దసరా లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో నాని అదిరిపోయే రా అండ్ రష్టిక్ పాత్రలో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లు ... టీజర్ ... పాటలు ... ట్రైలర్ లలో నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ పాత్రలో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది .

ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు తో పాటు కన్నడ , తమిళ్ , హిందీ , మలయాళ భాష ల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ భాషలకు సంబంధించిన ట్రైలర్ లను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది . ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: