ఉగాదికి మహేష్ మూవీ మూవీ నుండి ఆ అప్డేట్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మహేష్ ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే ... శ్రీ లిల హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. విరిద్దరి పాత్రలు కూడా ఈ మూవీ లో చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ మూవీ.లో శ్రీ లీల పాత్ర అదిరిపోయే రేంజ్ లో దర్శకుడు రాసుకున్నట్లు. .. అదే రేంజ్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించలేదు.

ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఈ సినిమా బృందం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ఉగాది కి ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఉగాది కి ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను మరియు టైటిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: