బాలయ్య ను కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి...!!

murali krishna
నందమూరి బాలకృష్ణ 'అఖండ' అలాగే 'వీర సింహా రెడ్డి' లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో అయితే ఉన్నారు..ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఆయన రెడీ అవుతున్నారు.. బాలయ్య తన 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే..

 మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన శ్రీలీల బాలయ్య కూతురిగా.. కాజల్ అగర్వాల్ ఆయనకు తొలిసారి జోడీగా నటిస్తున్నారని తెలుస్తుంది... యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.. ఇటీవలే రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభమైంది..

బాలయ్య నుండి ఫ్యాన్స్ అలాగే ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాల తో పాటు.. ఆయన ఇమేజ్‌కి తగ్గ కథ మరియు కథనాలతో బాలయ్య ని సరికొత్త అవతార్‌లో చూపిస్తూనే.. తన మార్క్ కామెడీ కూడా ఉంటుందని.. బాలయ్య కామెడీ చేయకపోయినా కామెడీ అనేది కనిపిస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడటా..బాలయ్య క్యారెక్టర్ సరికొత్త గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి..

 

ఇది లా ఉంటే ఈమధ్య శ్రీలీల షూట్‌లో జాయిన్ అయిన సంగతి తెలియజేస్తూ టీమ్ ఓ పోస్టర్ కూడా వదిలారు.. దానిలో బాలయ్య చేతిమీద యారో మార్క్ లాంటి టాటూ కూడా ఉంది.. అది చూసి అనిల్ రావిపూడి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు... అయితే ఆ టాటూ బాలయ్య మోచేతి వరకు వుంది.'ఆహా' లోని ఇండియన్ ఐడల్‌ షో కి బాలయ్య స్పెషల్ జడ్జిగా అటెండ్ అవబోతున్నాడటా.. సరికొత్త లుక్ లో ఎప్పటిలానే హై ఎనర్జీతో బాలయ్య అదరగొట్టనున్నాడు...

ఇక షూటింగ్‌కి సంబంధించిన పిక్స్‌లో బాలయ్య చేతిపైన ఉన్న టాటూలో సింహం గుర్తు కూడా కనిపిస్తోందటా.మరి బాలయ్య ను అదే మూస పాత్రలో కాకుండా కొద్దిగా కొత్తగా అనిల్ చూపిస్తాడో లేదో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: