నాటు నాటు పాటకు.. రాహుల్ సిప్లిగంజ్ పారితోషకం ఎంతో తెలుసా?

praveen
త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కాకముందు నుంచే నాటు నాటు పాటకు సంబంధించిన హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ పాట ఉర్రూతలూగించింది అని చెప్పాలి. ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అవడం.. నాటు నాటు పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ చేయడం చూసి పరీక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఇకపోతే ఈ పాటకి ఇటీవల అంతర్జాతీయ వేదికలో కూడా గుర్తింపు లభించింది. ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది ఈ పాట.

 దీంతో ఇక ఈ సినిమా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో అటు మొన్నటి వరకు సాదాసీదా సింగర్ గానే కొనసాగిన రాహుల్ సిప్లిగంజ్ కి సైతం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని చెప్పాలి. పేద కుటుంబానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ అంతకు అందుకు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మనదేశంలో అయితే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నాటు నాటు పాటకు సంబంధించిన సింగర్స్ ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు.

 అదే సమయంలో సెన్సేషన్ అయినా నాటు నాటు పాట పాడినందుకుగాను రాహుల్ సిప్లిగంజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ పాట పాడినందుకు రాహుల్ కి తక్కువ పారితోషకం దక్కిందట. 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ కి ఉన్న టాలెంట్ కు ఈ పారితోషకం  చాలా తక్కువే అని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాటకు తక్కువ రెమ్యూనరేషన్ ఉన్నప్పటికీ ఈ పాటతో వచ్చిన పేరుతో రాహుల్ కు వచ్చే ఆదాయం డబుల్ ఉంటుందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: