ఓటీటిలో స్ట్రిమింగ్ కాబోతున్న కిరణ్ అబ్బవరం మూవీ..!!

Divya
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ కథ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఆ చిత్రమే వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా గత నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఓటీటిలో అలరించడానికి ఈ సినిమా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ప్రముఖ ఓటీటి సంస్ధ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్నది. ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 22వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలియజేస్తోంది. మురళి శర్మ కామెడీ చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచినట్లు చెప్పవచ్చు

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కథ విజయానికి వస్తే.. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మురళి కిషోర్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా వచ్చాయి ఇదివరకే కిరణ్ అబ్బవరం నటించిన SR. కళ్యాణ మండపం సినిమాకి సంగీతాన్ని అందించిన భాస్కర్ బట్ల ఈ చిత్రానికి పాటలు రచించడం జరిగింది. మరి థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటిలో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూనే ఉన్నారు ఏప్రిల్ నెలలో కూడా తన తదుపరిచిత్రం విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుస పెట్టి ఏడాదిలోనే నాలుగైదు సినిమాలు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: