ఆ సినిమా కోసం రెండేళ్లు కాల్ షీట్స్.. సాయి పల్లవి..!!

Divya
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో డైలాగులతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోనీ ఈమె మాటలతో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగానే ఆఫర్లు వచ్చాయి.చిన్న సినిమాలే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది.

మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాలలో నటించింది. చివరిసారిగా గార్గి చిత్రంలో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగులో మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ చిత్రం తర్వాత సాయి పల్లవి మరే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ వార్తలపై కూడా సాయి పల్లవి పెద్దగా స్పందించలేదు.
తాజాగా సాయి పల్లవి ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతుందని ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు కాల్ షీట్స్ కేటాయించిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు ,తమిళ్ ,హిందీ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. టాలీవుడ్,  బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో సీత పాత్ర కోసం అల్లు అరవింద్ సాయి పల్లవిని సంప్రదించారట. దీంతో కథ నచ్చడంతో ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు కాల్ షీట్స్ ఇచ్చిందని ఫిలిం వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: