"రంగమార్తాండ" మూవీ థియేటర్ తెలుగు హక్కులను మొత్తంగా దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ ఆఖరుగా నక్షత్రం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అలాగే నక్షత్రం ముందు కూడా కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందాయి. 

ఇలా ప్రస్తుతం వరుస అపజయాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. సామ్రాట్ అనే మరాఠి మూవీ కి ఈ సినిమా అఫీషియల్ రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాలో బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక రాజశేఖర్ , అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం థియేటర్ హక్కులను ప్రముఖ సంస్థలలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తో కృష్ణ వంశీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: