డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రష్మిక..!!

Divya
హీరోయిన్ రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇమే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తన పేరు మాత్రం వైరల్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం క్రికెటర్ శుభమాన్ గిల్ రష్మిక అంటే ఇష్టమని చెప్పడంతో వీరిద్దరి మధ్య పలు వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ విషయంపై రష్మిక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

క్రికెటర్ శుభమాన్ గిల్ ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం శుభమాన్ పేరును సచిన్ టెండుల్కర్ కుమార్తె  సారా టెండుల్కర్ లింకు చేస్తే తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడుతూ.. తన క్రష్ పేరును వెల్లడించారు. ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సారా అలీ ఖాన్ లేదా సార టెండుల్కర్ మాత్రం కాదని దక్షణాది సినిమాలలో ప్రముఖ నటి తన క్రష్ అని తెలిపారు.
మీకు ఇష్టమైన బాలీవుడ్ నటి ఎవరు అని అడగగా ఆయన సమాధానం ఇస్తూ రష్మిక  నా క్రష్ అంటూ బదులిచ్చారు. దీంతో ఈ సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే గత ఏడాది మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఇష్టమైన నటి ఎవరు.. అని అడగగా వెంటనే సారా అంటూ బదులిచ్చారు. అలాగే మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా అవును ..కాకపోవచ్చు అంటూ తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక పై వస్తున్న డేటింగ్ వార్తలను రష్మిక ఖండించడం జరిగింది. తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: