ఆ బ్యాక్ డ్రాప్ లో పవన్ "ఓజి" మూవీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ దర్శకుడు రన్ రాజా రన్ మూవీ తో అదిరిపోయే విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకుడుగా వ్యవహరించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇలా సాహో లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "ఓజి" అనే మూవీ ని రూపొందించ బోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ టైటిల్ లోగో విడుదల కాగానే ఈ మూవీ పై భారీ లెవెల్లో అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరో వార్త కూడా ప్రస్తుతం చర్చల్లో నిలిచింది. ఈ మూవీ ని దర్శకుడు ముంబై బేస్డ్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు వినోదయ సీతం రీమేక్ లోను ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: