ఆ హీరోకి పెళ్ళైనప్పుడు.. నా హార్ట్ బ్రేక్ అయింది : మీనా

praveen
సాధారణంగా ఎంతో మంది అమ్మాయిలు సినిమా హీరోలపై ఇష్టాన్ని పెంచుకోవడం చూస్తూ ఉంటాం. ఇక ఆ హీరోలే తమ క్రష్ అంటూ ఎప్పుడూ అమ్మాయిలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే కేవలం సాధారణ అమ్మాయిలు మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న వారు సైతం కొంతమంది నటులపై ఇష్టాన్ని పెంచుకొని ఇక వారినే క్రష్ గా భావిస్తూ ఉంటారు అన్న విషయం అప్పుడప్పుడు వారు చెప్పినప్పుడే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అని చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా ఇలాంటి విషయాలను ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది.

 టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది మీనా. హోమ్లి హీరోయిన్గా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే గతంలో తనకు హృతిక్ రోషన్ అంటే క్రష్ అంటూ చెప్పిన మీనా. ఇటీవలే ఆ హీరో పై ఉన్న ఇష్టాన్ని మరోసారి చాటుకుంది అని చెప్పాలి. హృతిక్ రోషన్ కి పెళ్లయినప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. ఇక అతనిలాంటి భర్త రావాలని కోరుకునేదాన్ని అంటూ మీనా చెప్పుకొచ్చింది. కాగా మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యాసాగర్ ను 2009లో వివాహం చేసుకుంది. విద్యాసాగర్ ఇక ఊపిరితిత్తుల సమస్యతో గత ఏడాది జూన్లో మరణించారు. ఇక భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది మీనా.

 అయితే మీనా తన కెరీర్ను బాలనాటిగా మొదలుపెట్టింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల తన కెరియర్ లో 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఇటీవల మీనా 40 పేరుతో ఒక వేడుక నిర్వహించారు. రజనీకాంత్, సుహాసిని, రోజా తదితరులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు అని చెప్పాలి. అయితే ఇక ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ హీరోయిన్ మీనా. ఇకపోతే టాలీవుడ్లో అందరూ హీరోల సరసన నటించిన మీనా అందరికీ పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: